Teaching staff

Wednesday, April 8, 2020

ACADEMIC ACTIVITIES


v  అకడమిక్  అంశాలు:

Ø  పాఠశాలలో నిర్ధిష్టమైన వార్షిక ప్రణాళికతో విద్యార్ధులలో గుణాత్మక విద్యను పెంపోదించుటలో భాగంగా CCE వంటి అధునాతన విద్యావిధానాన్ని అనుసరించటమే కాకుండా, కనీస అభ్యసన స్థాయిలు లేని విద్యార్ధుల కొరకై 3R's కార్యక్రమం నిర్వహించడం జరుగుచున్నది.

Ø  తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని,మాండలిక భాష యొక్క మాధుర్యాన్ని విద్యార్ధులకు తెలియజేసే     లక్ష్యంగా తెలుగు భాషాదినోత్సవం, మాతృభాషాదినోత్సవాలలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది.

Ø  మన జాతీయభాష అయిన హిందీ పట్ల ఆసక్తిని పెంచడానికి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 14
         "హిందీ దివస్"ను ఘనంగా నిర్వహించడం జరుగుచున్నది.

Ø  ఇంగ్లీషు భాషలో నైపుణ్యాలను పెంపోదించుటకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో "ENGLISH MELA" నిర్వహించి అందరి ప్రశంసలు పొందడం జరిగినది.జాతీయ స్థాయి "SPELL BEE"పోటీలలో మన పాఠశాల విద్యార్ధులు 4,5 మరియు 6 ర్యాంకులు కైవసం చేసుకొన్నారు

Ø  2017 సంవత్సరంలో మన పాఠశాలలో రాష్ట్రస్థాయి గణిత దినోత్సవ వేడుకలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. “State level skills exploration examination” లో మన పాఠశాల విద్యార్ధులు ప్రధమ,ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. విద్యా సంవత్సరం జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా మండల స్థాయిలో నిర్వహించిన ప్రతిభాపాటవ పరీక్షలో మన పాఠశాల విద్యార్ధి ద్వితీయ స్థానాన్నిసాధించి జిల్లాస్థాయి పోటీలలో పాల్గొనడం జరిగినది.

Ø  విద్యార్ధుల ప్రయోగ నైపుణ్యాలను వెలికి తీయడానికి  నిర్వహించే "అన్వేషిక"పోటీలలో   2017-18 విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 2 స్థానాన్ని పొందటం జరిగింది. విద్యా సంవత్సరం కూడా మన పాఠశాల విద్యార్ధి పోటీలలో ఎంపిక కావడం జరిగింది. దీనికి గాను జాతీయస్థాయిలో పరిశోధనలు నిర్వహించే ప్రయోగశాలను వేసవి సెలవుల్లో సందర్శించే అవకాశాన్ని పొందడం జరిగింది. జాతీయస్థాయిలో నిర్వహించే PCRA, విద్యార్ధి విఙ్ఞాన్ మంథన్ (VVM), మరియు ISRO online పరీక్షలలో మన పాఠశాల విద్యార్ధులు ఉత్తీర్ణత పొంది, ప్రశంసాపత్రాలు పొందడం జరిగింది. 

Ø  విద్యార్ధులలో శాస్త్రీయ దృక్పదాన్ని పెంపొందించేదుకు నిర్వహించే ”INSPIRE విద్యావైఙ్ఞానిక ప్రదర్శనలో మన పాఠశాల నుండి 2 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగినది.

Ø  భారత పార్లమెంటు పనితీరు,చట్టాల రూపకల్పనపై విద్యార్ధులకు సరైన రీతిలో అవగాహన కల్పించుట కొరకు మన పాఠశాలలో "MOCK PARLIAMENT" నిర్వహించడం జరిగినది. “గాంధీ జయంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.


SSC RESULTS


v  S.S.C ఫలితాలు:

ప్రతి సంవత్సరం మన పాఠశాల విద్యార్థినీ-విద్యార్థులు SSC పరిక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరుచుట వలన IIIT బాసరలో సీట్లు సాధిస్తున్నారు. గత విద్యా సంవత్సరం కూడా మన పాఠశాల విద్యార్థిని కుప్పాల రవళిక 9.8 GPA సాధించి మండల స్థాయిలో ప్రధమ స్థానంలో నిలవటమే కాకుండా  IIIT బాసరలో సీటు సాధించడం జరిగింది. ఇంకా అనేక మంది విద్యార్థులు పలు ప్రతిష్టాత్మక కళాశాలల్లో చేరడం జరుగుతున్నది.


ABOUT OUR SCHOOL


జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - ధర్మారం
మం: గీసుగొండ జి: వరంగల్ రూరల్

ZPHS DHARMARAM

ZPHS ధర్మారం పాఠశాల 1948 సంవత్సరంలో ప్రాధమిక పాఠశాలగా ప్రారంభించబడి, 1972 లో ఉన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేయబడినది. పాఠశాలలో శ్రీ కె.నర్సింహారెడ్డిగారు ప్రధానోపాధ్యాయులుగా సుదీర్ఘకాలం పనిచేసి పాఠశాల యొక్క ప్రాముఖ్యతను, గౌరవాన్ని పెంచారు.
                   ఈ పాఠశాల ప్రస్తుతం 403 మంది విద్యార్థినీ-విద్యార్థులతో, 30మంది బోధనా-బోధనేతర సిబ్బందితో వరంగల్ రూరల్ జిల్లాలో మూడవ అతిపెద్ద పాఠశాలగా గుర్తింపబడింది.

ACADEMIC ACTIVITIES

v   అకడమిక్  అంశాలు : Ø   పాఠశాలలో నిర్ధిష్టమైన వార్షిక ప్రణాళికతో విద్యార్ధులలో గుణాత్మక విద్యను పెంపోదించుటలో భాగంగా CCE ...